Thursday, April 18, 2024

Breaking: పండగ వేళ విషాదం.. లారీ బోల్తా పడి నలుగురు దుర్మరణం

సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెంలో చేపల లోడుతో వెళ్తున్న లారీ.. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో లారీలో పది మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ మద్యం మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement