Tuesday, April 30, 2024

AP | రెండు మూడు నెలల్లో ఆర్టీసీకి 1400 కొత్త బస్సులు

అమరావతి, ఆంధ్రప్రభ: రానున్న రెండు మూడు నెలల్లో ఏపీఎస్‌ ఆర్టీసీకి 1400 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు రవాణాశాఖామంత్రి పినిపే విశ్వరూప్‌ వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. బుధవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఆర్టీసీ భూముల లీజు, కొత్త బస్సుల కొనుగోళ్ళపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.

ప్రస్తుతం ఆర్టీసీకి 10,960 బస్సులు ఉన్నాయని వీటిలో 2,610 బస్సులు లీజుకు నడుస్తున్నాయని తెలిపారు. అయితే కొత్తగా 402 బస్సులను ఇటీవలే కొనుగోలు చేశామని చెప్పారు. ఇంకా ఆర్టీసీ స్థలాల లీజు పై కూడా మంత్రి వివరణ ఇచ్చారు. సంస్థకు చెందిన 22.6 ఎకరాల భూములను 2023-24 లో లీజుకు ఇచ్చినట్లుగా వివరించారు. అలాగే మరో 2,731 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వీటిలో 1200 ఎలక్ట్రిక్‌ బస్సులు ఉన్నాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement