Friday, May 17, 2024

ఏపీలో కొత్త‌గా 13,618 క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా…రాజ‌కీయ నేత‌ల‌ను సైతం క‌రోనా వ‌దిలిపెట్ట‌డం లేదు. ఏపీలో వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో కొత్త‌గా 13,618 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 9మంది క‌రోనాతో చ‌నిపోయారని బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 22,22,573 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 14,570 మంది క‌రోనాతో చ‌నిపోయారు. 1,06,318 యాక్టివ్ కేసులుండ‌గా, 21,01,685మంది డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారిగా అనంతపురం 1650, చిత్తూరు 493, ఈస్ట్ గోదావరి 961, గుంటూరు 1464, కడప 907, కృష్ణా 803, కర్నూలు 1409, నెల్లూరు 1007, ప్రకాశం 1295, శ్రీకాకుళం 644, విశాఖపట్టణం 1791, విజయనగరం 466, వెస్ట్ గోదావరి 728 కేసులు న‌మోద‌య్యాయి. కరోనాతో తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్టణంలో ఇద్దరు, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు బులెటిన్ లో తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement