Friday, May 17, 2024

Writing Skills: పోలీసులకు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్..

సంగారెడ్డి: పోలీస్ కళ్యాణ మండపంలో పోలీసు అధికారులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. శనివారం
ఉదయం 11.00 గంటల నుండి 12.00 గంటల వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది వ్యాస రచన పోటీల్లో పాల్గొన్నారు..

ఇందులో “HOW TO USE SOCIAL MEDIA TO THE ADVANTAGE OF POLICE” (పోలీస్ ప్రయోజనాల కోసం సామాజిక మాద్యమాలను ఎలా ఉపయోగించుకోవాలి) “ROLE OF POLICE IN PROTECTING RIGHTS OF CHILDREN, WOMEN & WEAKER SECTION OF THE SOCIETY” (సమాజంలోని పిల్లలు, మహిళలు, బలహీనవర్గాల హక్కుల రక్షణలో పోలీసుల పాత్ర) అనే అంశాలపై సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఈ పోటీలను నిర్వహించారు.

ఈ వ్యాస రచన పోటీలకు 76 మంది పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ పోటీలను అడిషనల్ ఎస్పి కె .సృజన ఎస్బి సిఐ , శ్రీనివాస్ నాయుడు పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement