Monday, March 4, 2024

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు : జాయింట్ కలెక్టర్ మౌర్య రెడ్డి

నందికొట్కూరు, (ప్రభ న్యూస్): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు తప్పవని, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలదించుకుని విద్యార్థులకు అందించే భోజనం ఎలా పెట్టిన చూస్తూ ఎలా ఊరుకుంటారని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకూడదని గృహనిర్మాణ శాఖ జాయింట్ కలెక్టర్ మౌర్య రెడ్డి ఎంఈ ఓ ఫైజూనిసా బేగంను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, తహశీల్దార్ రాజశేఖర్ బాబుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకాన్ని) పరిశీలించి, భోజనం చేస్తున్న విద్యార్థులను భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. త‌మకు భోజనం సరిపోవడం లేదని, చాలీచాలని భోజనం, పప్పు తక్కువ వేస్తున్నారని విద్యార్థులు పిర్యాదు చేశారు. భోజనాన్ని జాయింట్ కలెక్టర్ చేతితో పరిశీలించారు.

భోజనం మెత్తగా ఉందని మధ్యాహ్న భోజనం కార్మికురాలిని పిలిపించి అడిగారు. భోజనం సరిగా చేయటం లేదని.. ఇలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మికులు సరిగా పనిచేయటం లేదని విద్యార్థులు దాదాపు వెయ్యి మంది ఉంటే.. అందుకు సరిపడే భోజనం వండటం లేదని పిర్యాదు చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చిన మార్పు రాలేదని ప్రధానోపాధ్యాయులు జాయింట్ కలెక్టర్ కు వివరించారు. కార్మికులపై జాయింట్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. మరో సారి ఇలాగే జరిగితే తొలగిస్తామని హెచ్చరించారు. పాఠశాలలో రూ.8లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్నా అది పనిచేయటం లేదని ఛైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ కు తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారులకు వివరించి నివేదిక పంపుతామన్నారు. కమిషనర్ అంకిరెడ్డి, వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి, ఎంఈఓ ఫైజూనిసా బేగం, కౌన్సిలర్లు కాటేపోగు చిన్న రాజు, చాంద్ బాషా, వైకాపా నాయకులు ఉస్మాన్ భేగ్, చింత శ్రీను, బొల్లెద్దుల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement