Friday, April 26, 2024

ఆంధ్రప్రభ కథనానికి స్పందన.. ఇసుక రవాణాపై ఇంటెలిజెన్స్‌ అధికారుల ఆరా..

జుక్కల్‌, (ప్రభన్యూస్‌) : మాంజీరాలో ఇసుక తోడేళ్ళు, మాంజీరా నది నుండి కర్ణాటకకు జోరుగా ఇసుక రవాణా అన్న శీర్షికన ఆంధ్రప్రభ జిల్లా సంచికలో నిన్న‌ ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఈ వార్తా కథనం పట్ల ఖండెబల్లూర్‌, వజ్రఖండి, డోన్‌గావ్‌, సోపూర్‌ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేయడమే కాకుండా ఓవర్‌ లోడ్‌ లారీల వలన కొత్తగా వేసిన తారు రోడ్డు ద్వంసమవుతుందని, ఈ వార్త రావడంతో అక్రమ ఇసుక లారీలు తిరగలేదని వారు హర్షం వ్యక్తంచేశారు. వార్త కథనానికి స్పందించిన ఇంటలిజెన్స్‌ ఉన్నతాధికారులు.. అక్రమ ఇసుక రవాణా, ఇసుక తరలింపు వెనుక ఉన్న నేతలు, అధికారులపై నిన్న‌ ఇంటలిజెన్స్‌ అధికారులు ఆరా తీశారు.

వజ్రఖండి సర్పంచ్‌ సంజీవ్‌కుమార్‌, డోన్‌గావ్‌ సర్పంచ్‌ మేత్రికళావతి, సోపూర్‌ సర్పంచ్‌ అనుశాబాయి అం ద్రప్రభ కథనం పట్ల హర్షం వ్యక్తం చేయడమే కాకుండా కర్ణాటక సరిహద్దులో సోపూర్‌ బ్రిడ్జి వద్ద జిల్లా అధికారులు ప్రత్యేకంగా చెక్‌పోస్టును ఏర్పాటు చేసి తెలంగాణ ఖనిజ సంపద కాపాడాలని, అక్రమార్కుల ఆటకట్టించాలని, రోడ్లు చెడిపోకుండా చర్యలు తీసుకోవాలని, అక్రమ రవాణావలన తెలంగాణ ప్రభుత్వ ఖజనాకు గండిని పూడ్చాలని తెలిపారు. ఇప్పటికైనా మైనింగ్‌, బిచ్కుంద రెవెన్యూ అధికారులు అక్రమ రవాణా కోసం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ సహయ సహకారాలు అందించాలని కోరారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement