Tuesday, October 8, 2024

కేటీఆర్ కు సీఎం అయ్యే అర్హత లేదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యే అర్హతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లేవని లేవని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. వ్యక్తిగతంగా చూస్తే కేటీఆర్ చాలా మంచి వ్యక్తి అని… అయితే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు మాత్రం ఆయన సరైన వ్యక్తి కాదని చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యే అర్హత కేవలం ఇద్దరికి మాత్రమే ఉందని…వారు హరీశ్ రావు, ఈటల రాజేందర్ అని వ్యాఖ్యనించారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా కొంత వరకు ఆ అర్హత ఉందని అన్నారు.

టీఆర్ఎస్ నాయకులతో తనకు ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీలో తనకు శత్రువులు ఎవరూ లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడిందని… అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోకలేకపోతోందని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement