Monday, June 24, 2024

షాకింగ్.. గంగా, యుమునా నదుల్లో గుట్టలు గుట్టలుగా శవాలు

బీహార్‌ రాష్ట్రంలోని బక్సర్‌ జిల్లాలో గంగా నదిలో గుట్టలు గుట్టలుగా శవాలు తేలియాడుతున్నాయి. కిలోమీటర్‌ పరిధిలో 48 మృతదేహాలు తేలియాడుతూ కనిపించడం కలకలం రేపింది. కరోనాతో చనిపోయిన మృత దేహాలను గంగా నదిలో పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా దయనీయ పరిస్థితులు నెలకొన్న సమయంలో శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి.

మరోవైపు ఆదివారం నాడు యూపీలోని హామీర్‌పూర్ వద్ద యమునా నదిలో కూడా శవాలు గుట్టలుగా తేలియాడుతూ కనిపించాయి. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ఇలా నదిలో పడేసినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యమునా నదిలో డజన్లకు పైగా కరోనా మృతదేహాలు నదీ తీరంలో తేలుతున్న ఘటనలు స్థానికుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. హామీర్‌పూర్, కాన్పూర్ జిల్లాల్లోని గ్రామాల్లో మృతుల సంఖ్య పెరిగిపోగా.. స్మశానాల్లో చోటులేక మృతదేహాలను నదుల్లో వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement