Saturday, May 11, 2024

Drugs case: ముగిసిన రవితేజ విచారణ

టాలీవడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ సినీ నటుడు రవితేజ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు హీరో రవితేజ.. 11 గంటలకు విచారణ ప్రారంభమైంది.. ఇక, రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఉదయం 9 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 5 గంటల పాటు విచారణ సాగింది. దాదాపు 5 గంటలకు పైగా రవితేజను ప్రశ్నించారు ఈడీ అధికారులు.. మనీల్యాండరింగ్‌కు సంబంధించిన విషయంలో దర్యాప్తు బృందం ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈడీ విచారణలో రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌ కూడా కీలకంగా మారాడు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ముందుగా పట్టుబడింది శ్రీనివాసే. అతడిని ఎక్సైజ్‌ ప్రత్యేక బృందం విచారించడంతో కెల్విన్‌ పేరు తెరపైకి వచ్చింది.. వీరి ఇద్దరినీ విచారించడంతో.. టాలీవుడ్‌ స్టార్స్ డ్రగ్స్‌ వినియోగం బటపడింది. శ్రీనివాస్ ద్వారా నటీనటులకు డ్రగ్స్‌ సరఫరా అయినట్టు అధికారులు గుర్తించారు.

ఈ విచారణ సమయంలో గతంలో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన కెల్విన్‌ స్నేహితుడు జిషాన్‌ను ఈడీ కార్యాలయానికి రప్పించారు. ఈడీ విచారణలో రవితేజకు సంబంధించిన ఐదేళ్ల బ్యాంకు లావాదేవీలను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. రవితేజ ఖాతాలతో పాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇతర ఖాతాల్లోకి వెళ్లినట్టుగా గుర్తించారని చెబుతున్నారు. అయితే, బ్యాంకు లావాదేవీల చుట్టూ.. విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Bigg Boss: మనసు విప్పి మాట్లాడిన శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి..

Advertisement

తాజా వార్తలు

Advertisement