Monday, May 6, 2024

TATA | రెండేళ్లలో 50,000 ఉద్యోగాలు.. అతిపెద్ద ఐఫోన్‌ అసెంబ్లి ప్లాంట్‌కు టాటా కసరత్తు

యాపిల్‌తో ఒప్పందానికి అనుగుణంగా భారత్‌లో అతిపెద్ద ఐఫోన్‌ అసెంబ్లి ప్లాంట్‌ ఏర్పాటుకు టాటా గ్రూప్‌ సన్నాహాలు చేపట్టింది. తమిళనాడులోని #హూసూర్‌లో ఈ భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రెండేండ్లలో 50,000 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని బ్లూంబర్గ్‌ రిపోర్ట్‌ పేర్కొంది. కర్ణాటకలోని ఈ ప్లాంట్‌ కొనుగోలు ద్వారా ఐఫోన్లు తయారుచేసే తొలి భారత కంపెనీగా అవతరించిన టాటా గ్రూప్‌, ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.

భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్న యాపిల్‌ లక్ష్యానికి అనుగుణంగా టాటా గ్రూప్‌ ఈ అడుగులు వేస్తోంది. తమిళనాడులోని హూసూరులో ప్రతిపాదిత కొత్త ఫ్యాక్టరీ నెలకొల్పాలని భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ప్లాంట్‌ కంటే పెద్ద ప్లాంట్‌ను నెలకొల్పి, తద్వారా సుమారు 50 వేల మందికి ఉపాధి కల్పించాలని టాటా గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం.

ఇందులో 20 అసెంబ్లి లైన్స్‌ ఉంటాయని తెలుస్తోంది. కొత్తప్లాంట్‌లో 12 నుంచి 18 నెలల్లోగా కార్యకలాపాలు చేపట్టే లక్ష్యంగా టాటా గ్రూప్‌ కసరత్తు సాగిస్తోంది. తయారీ రంగంలో చైనాపై ఆధారపడటం తగ్గించే క్రమంలో సప్లయి చైన్‌ను భిన్న ప్రాంతాల్లో చేపట్టాలన్న యాపిల్‌ వ్యూహానికి అనుగుణంగా ఈ ప్లాంట్‌ అందుబాటులోకి రానుంది.

- Advertisement -

భారత్‌, థాయ్‌లాండ్‌, మలేషియా సహా పలు దేశాలకు చెందిన అసెంబ్లిd, కాంపోనెంట్‌ మ్యాన్యుఫ్యాక్చరర్లతో యాపిల్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. టాటా గ్రూప్‌ చేపట్టబోయే నూతన ప్లాంట్‌ యాపిల్‌ దేశీయంగా చేపట్టే సప్లయి చైన్‌ సన్నాహాల్లో కీలకంగా వ్యవహిరించనుంది. ఇక యాపిల్‌ ప్రోడక్ట్స్‌ విక్రయానికి సంబంధించి 100 రిటైల్‌ స్టోర్స్‌ను టాటా ప్రారంభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement