Wednesday, May 1, 2024

TS : చెరువులో ప‌డ్డ బాలుడి… కాపాడ‌బోయి యువ‌కుడు గ‌ల్లంతు…

చెరువులో ప‌డ్డ బాలుడిని కాపాడ‌బోయి యువకుడు గ‌ల్లంత‌య్యాడు. ఈఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని హ‌కీంపేట‌లో చోటుచేసుకుంది.
ఫిల్మ్ నగర్ కు చెందిన పవన్ రాజ్ ఆదివారం సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి హకీంపేట చెరువు దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో ఓ బాలుడు చెరువులో పడిపోయాడు.

- Advertisement -

అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు పవన్ రాజ్. బాలుడి రక్షించిన తర్వాత పవన్ రాజ్ చెరువులో కనిపించకుండా పోయాడు. పవన్ రాజు కోసం నిన్నటి నుంచి ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు చెరువులో గాలిస్తున్నాయి. ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement