Friday, May 10, 2024

Protest – ఇథ‌నాల్ ఫ్యాక్టరీ ఎత్తివేయాలని కోరుతూ రాస్తారోకో

ఇథ‌నాల్ ఫ్యాక్టరీ వద్దు వ్యవసాయ పంటలే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ గుండంపెల్లి గ్రామస్తులు దిలావర్పూర్ ఎక్స్ రోడ్ పై శనివారం రాస్తారోకో నిర్వహించారు. గుండం పల్లి ప్రాంతంలో ఈతనల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కొనసాగితే ఫ్యాక్టరీ నుంచి విషవాయులు వస్తాయని దానివల్ల మా పంటలు దెబ్బతింటాయని ఫ్యాక్టరీ నిర్మాణం ఎత్తివేలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి.

సంఘటన స్థలాన్ని చేరుకున్న దిలావర్పూర్ ఎస్సై గంగాధర్ రాస్తారోకో చేస్తున్న రైతులను రోడ్డుపై నుండి బలవంతంగా పక్కకు తీసుకువెళ్లారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ ఇతర నిర్మాణం చేపడితే ఇంకా పెద్ద ఎత్తున అందరు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ తక్కల రమణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొమ్ముల దేవేందర్ రెడ్డి, ముత్యం రెడ్డి రాజారెడ్డి తోపాటు 50 మంది రైతులు కలరు

Advertisement

తాజా వార్తలు

Advertisement