Thursday, April 25, 2024

World Delicious – అహా.. ఏమీ రుచి.. హైదరాబాదీ ‘ఫలక్ నుమా’ బిరియాని

హైదరాబాద్ ఫలక్నుమా బిర్యానీ అడ్డా… ప్రపంచ రుచుల ఘుమ ఘుమల అడ్డాలో ప్రత్యక్షమైంది. అంతేనా.. భారత దేశంలో ఫస్టప్లేస్కు పరుగులు తీస్తోంది.లోకం చుట్టే వీరులకు , భోజన ప్రియులకు ప్రపంచంలో ఎక్కడెక్కడ రెస్టారెంట్లల్లో ఏయే పలహారం నోరూరిస్తుందో.. తెలిపే సమాచారాన్ని ఇచ్చే గైడ్ను తయారు చేసిన ప్యారిస్ చెందిన లా లిస్టే అనే సంస్థ ఓ జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 1000 రెస్టారెంట్ల పేర్లను, చిరునామాను ప్రకటించగా… ఇందులో హైదరాబాదీ బీర్యానీకి ఫ్యామస్ ఫలక్నుమా అడ్డా పేరును చేర్చింది.

అంతే కాదు ఫలక్నుమా అడ్డా భారత దేశంలోనూ మూడవ స్థానంలో ఉందని ప్రకటించింది. బహుత్ ఖూబ్ ఖబర్ హై.. ఫలక్నుమా జల్దీ నెంబర్ వన్ బనేగా… ఎందుకంటే.. ఏదేశం నుంచి వచ్చినా ఇక్కడి బిర్యానీ తింటే.. మళ్లీ మళ్లీ భారత్కు రావాల్సిందే. హైదరాబాద్ గడ్డ మీద కాలు పెట్టాల్పిందే. ఏ దేశమేగినా..ఎందు కాలిడినా.. పొగడరా నా తల్లి తెలంగాణాను.. ఫలక్నుమా బిర్యానీ రుచులను అన్నట్టు.. ఈ కబురు ధూమ్ ధామ్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement