Tuesday, May 28, 2024

Minister: గిరిజ‌నుల అభ్యున్న‌తికి కృషి చేస్తా-తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు

ఖమ్మం: పేదలు, బడుగు బలహీన వర్గాల ఆశయాలకు అనుగుణంగానే పాలన ఉంటుందని హామీనిచ్చారు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాగే గిరిజనుల ఆత్మగౌరవ నిలబెట్టే విధంగా అభివృద్ధి ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని అన్నారు మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా కేంద్రంలో సీపీఐఎంఎల్ ప్రజాపంథా కార్యాలయానికి వెళ్లిన మంత్రి నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పుడు మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చిందని, తాను శాయశక్తులా ప్రయత్నించి గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. గత పాలకులు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాన్ని ఎండగట్టారని, ఎన్నికల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడేందుకు నా గెలుపుకు కృషి చేసిన విషయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోనని అన్నారు. గత ప్రభుత్వంలో తాను మంత్రి గా ఉన్నప్పుడు ఎక్కువ శాతం గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం పాటుపడిన విషయం గుర్తు చేశారు. త‌న విజ‌యానికి స‌హ‌క‌రించిన ప్ర‌జాపంథా నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు మంత్రి. ఈ సమావేశంలో ప్రజాపంథా నాయకులు పోటు రంగారావు, మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement