Sunday, May 5, 2024

విమెన్ సేఫ్టి వింగ్.. మహిళా భద్రతకు పెద్దపీట..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత పెంచడానికి విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఎంతగానో కృషి చేస్తుందని, విమెన్‌ సేఫ్టీ వింగ్‌లో పని చేస్తున్న అధికారులను అభినందించాడు డీజీపీ మహేందర్‌రెడ్డి. ప్రజలతో అనుసంధానం చేసుకుని మహిళల భద్రతకు విమెన్‌ సేఫ్టీ వింగ్‌ పని చేస్తుందంటూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహిళల భద్రత మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. షీ భరోసా సైబర్‌ ల్యాబ్‌ కేంద్రం, ఎన్నారై సెల్‌, కౌన్సెలింగ్‌ కేంద్రం, మానవ అక్రమ రవాణా నిరోధక కేంద్రం, మిస్సింగ్‌ పర్సన్స్‌ మానిటరింగ్‌ సెల్‌ కేంద్రాలను మంగళవారం ప్రారంభించిన అనమంతరం డీజీపీ మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న నేరాలను సత్వరం పరిష్కరించేందుకు సైబర్‌ ల్యాబ్‌ ఎంతగానో ఉపయో గపడుతుందన్నారు. మిస్సింగ్‌ పర్సన్‌ యూనిట్‌ అనే సేఫ్‌ సహకారంతో ఏర్పాటు చేశామని, 800 పోలీస్‌ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్‌ కేసులను సైబర్‌ ల్యాబ్‌ మానిటరింగ్‌ చేస్తుందని తెలిపారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, హైదరా బాద్‌లో ఏడు లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు.

నేరం జరిగితే దొరికిపోతామనే భయాన్ని సీసీటీవీ కెమెరాలు ద్వారా రుజువు అవుతుందని, గత ఆరేళ్లలో నేరస్తులకు 58 శాతం శిక్షలు పడేలా చేశామని చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను కంట్రోల్‌ చేస్తున్నామన్నారు.హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిటిజన్‌ సేఫ్టీ కోసం పోలీస్‌ శాఖ అనేక నూతన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సైబర్‌ ల్యాబ్‌ అనేది మహిళల రక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుందని, హైదరా బాద్‌ సిటీ పోలీస్‌ శాఖ పరిధిలో చాలామంది నేరస్తుల కు జీవితకాలం శిక్ష పడేలా చేశామని తెలిపారు.
ఏడీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న నేరాలను నిర్మూలించడానికి విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఏర్పాటైందని, ఎన్‌జీవో స్వచ్చంద సంస్థలు మహిళల నేరాలను నిర్మూలించ డానికి పోలీసులతో కలిసి పని చేస్తున్నార న్నారు.331 షీ టీమ్స్‌ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశామని వెల్లడించారు. సైబర్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్స్‌తో కాలేజీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, సైబర్‌ కాంగ్రెస్‌ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పా రు. తలం గాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు భరొ సా కేంద్రాలను ప్రారంభించామని, త్వరలో మరి కొన్ని భరోసా కేంద్రాలను ప్రారంభిం చబోతు న్నామని తెలిపారు.

మహి ళలపై, చిన్నారులపై జరుగుతున్న హత్యా చారాలు, హత్యలపై సైబర్‌ ఎక్స్‌పర్ట్‌తో నేరస్తులను గుర్తిస్తున్నా మని, మిస్సింగ్‌ పర్సన్‌ మానిట రింగ్‌ సెల్‌ను కూడా ప్రారంభించామని చెప్పారు. ఎన్నారై సెల్‌ ద్వారా ఇతర దేశాల ఉన్న నేరస్తులను గుర్తించడం జరుగుతుం దన్నారు. రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ, మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్‌ ప్రారంభించిందని, విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ద్వారా మహి ళలపై జరుగుతున్న అనేక నేరాలను అరికడుతుం దన్నారు. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మాట్లా డుతూ, మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధిం చడానికి సైబర్‌ ల్యాబ్‌ ఎంతగానో ఉపయోగపడు తుందని, సోషల్‌ మీడియాలో మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించడానికి సైబర్‌ ల్యాబ్‌ కృషి చేస్తోందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement