Thursday, May 23, 2024

TS : మంత్రాలు చేస్తుంద‌నే నేపంతో మ‌హిళ హ‌త్య‌…

మూఢ‌న‌మ్మ‌కాల‌పై ఎంత అవ‌గాహ‌న క‌ల్పించిన మార్పు రావ‌డం లేదు. ఎక్క‌డో అక్క‌డ మంత్రాలు చేస్తున్నారనే నేపంతో దాడులు చేస్తూ వారి ప్రాణాల‌ను బ‌లిగొంటున్నారు. తాజా ఇలాంటీ ఘ‌ట‌నే నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రెంజల్ మండలం బోర్గం గ్రామంలో చంద్రకళ అనే మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

- Advertisement -

గురువారం నవీపేట్ మండలం కోస్లీ గ్రామ శివారులోని అలీసాగర్ లిఫ్ట్ కెనాల్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఉందనే సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. పంచనామ అనంతరం దర్యాప్తు చేయగా సదరు మహిళ రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తలపై గాయం ఉండడంతో అనుమనదాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన మృతురాలు మంగళి చంద్రకళ మంత్రాలు చేస్తున్నదనే నేపథ్యంలో హత్య చేసి కోస్లీ కెనాల్‌లో పడేశారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులు మృతురాలికి రూ.50 వేల బాకీ ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement