Friday, May 3, 2024

Aviation Show: వింగ్స్‌ ఇండియా-2024 వైమానిక ప్రదర్శన ప్రారంభం

బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ… హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా 2024 ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ‘వింగ్స్ ఇండియా కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్నదుకు సంతోషంగా ఉంది. తెలంగాణలో ఏవియేషన్‌ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ దేశంలోనే ఎంతో అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వారంలో మూడు సార్లు విమానం వేయాలని జ్యోతిరాదిత్య సింధియాను కోరాను. ఎయిర్ అంబులెన్స్ లు ఎక్కువగా హైదరాబాద్ వస్తున్నాయి. ఏరో స్పేస్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఎంతో అనుకూలం. డ్రోన్‌ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి.. వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నాం’ అని కోమటిరెడ్డి తెలిపారు.

వింగ్స్ ఇండియా ప్రదర్శన కోసం పలు విమానాలు ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. మొత్తం 25 రకాల విమానాల ప్రదర్శన ఉంటుంది. 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధుల హాజరయ్యారు. భారత వాయుసేనకు చెందిన సారంగ్‌ బృందం జనవరి 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. వింగ్స్ ఇండియా టికెట్‌ రూ. 750గా ఉంది. బుక్‌మైషో యాప్‌ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు మాత్రం ఉచితం.

Advertisement

తాజా వార్తలు

Advertisement