Wednesday, April 17, 2024

NZB: మైనారిటీలకు అండగా ఉంటా.. ఎమ్మెల్యే బాజిరెడ్డి

నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 24 (ప్రభ న్యూస్) : మైనారిటీలకు తాను ఏ సమస్య వచ్చినా ముందుంటామని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ హామీ ఇచ్చారు. రూరల్ మండలంలోని గుండారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మైనారిటీ దర్గాను సందర్శించి పరిశీలించారు. అనంతరం బాజిరెడ్డిని మైనారిటీ సోదరులు శాలువాతో సన్మానించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… భవిష్యత్తులో మైనారిటీలకు అండగా ఉంటామని, షాదీ ముబారక్, పింఛన్లతో పాటు మరెన్నో పథకాలు ప్రవేశ పెడతామని, రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించేందుకు మైనారిటీలు కలసికట్టుగా పనిచేయాలన్నారు. జెడ్పీటీసీ బోల్లెంక సుమలత గోపాల్ రెడ్డి, ఐడిసీఎం ఎస్ చైర్మెన్ సాంబార్ మోహన్, ప్రేమ్ నాయక్, బాగా రెడ్డి గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ అంకల గంగాధర్, నుడా డైరెక్టర్ సంతోష్, మైనారిటీ అధ్యక్షులు జామీర్ ఖాన్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement