Sunday, February 25, 2024

KHM: భర్త చేతిలో భార్య హతం.. గోడ్డలితో నరికిన వైనం

భద్రాద్రి కొత్తగూడెం ‌జిల్లా, మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త గోడ్డలితో నరికి చంపిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… సమితి సింగారం గ్రామానికి చెందిన గట్టికోప్పుల రాములు, భార్య మంగతాయారు(55) వీరి ఇరువురు మధ్య కుటుంబ కలహలు తరుచూ జరుగుతున్నాయని, గురువారం రాత్రి కూడా గొడవ పడ్డారని, కోపానికి గురైన భర్త రాములు, శుక్రవారం తెల్లవారు జామున భార్య మంగతాయారును నిద్రలో ఉండగానే గోడ్డలితో నరికి చంపాడు.

నిందితుడు తన భార్యను హత్య చేసానని మణుగూరు పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. సి.ఐ రమకాంత్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య ఘటనతో మణుగూరులో సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement