Sunday, April 28, 2024

TS: పసుపు బోర్డు ఎక్కడ ? .. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 2 (ప్రభ న్యూస్) : పదే పదే పసుపు బోర్డుపై మాట్లాడుతున్న ఎంపీ అరవింద్ పసుపు బోర్డు అసలు హైదరాబాద్ లోనా, నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తావా పసుపు బోర్డు ఎక్కడ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. నరేంద్ర మోడీ పసుపు బోర్డుకు జీవో ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో విది విధానాలు తెలియజేయలేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి, బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పోరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని ధ్వ‌జమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే భారీ మెజారిటీతో గెలుస్తామనే నమ్మకం కలిగిందని కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేని బిజెపి ప్రభుత్వమని తెలిపారు. సంవ త్సరానికి రెండు కోట్ల ఉద్లోగలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. త‌మ పార్టీ జాతీయ పార్టీ, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా బిఆర్ఎస్ వైఫల్యం చెందటంతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. బిజెపి పార్టీ నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం దారుణమ‌న్నారు. విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనం తెచ్చి ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ15 లక్షల రూపాయిలు వేస్తామని చెప్పిన నాయకులు ఇప్పటి వరకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.

ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీలను త్వరలో తెరిపిస్తాం…
జాతీయ స్థాయిలో మార్పు రావాలని రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని ప్రైవేట్ పరం చేసిందని, రైల్వేలు, రోడ్లు ప్రైవేటీకరణ చేసిందని ఆయన విరుచుకుపడ్డారు. 2001లో చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే, 2015 కవిత ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు మూసి వేయించిందని ధ్వజమెత్తారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా త్వరలోనే ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి రాగానే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో బోధన్, మెట్ పల్లీ షుగర్ ఫ్యాక్టరీలు సందర్శించడం జరిగిందన్నారు. 2025 చివరి నాటికి మూత పడిన చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. 2015 సంవత్సరంలో ఎంపీ హోదాలో ఉన్న కవిత రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడిందని ఆరోపించారు. 2019లో రైతులకు పసుపు బోర్డు తీసుకువస్తానని నమ్మించి బాండ్ పేపర్ ఇచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి ఎంపీ అరవింద్ గెలిచాడన్నారు. నిజామాబాద్ కూడా స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందే విధంగా ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామని, విద్య వైద్య ఉపాధి పరంగా మెరుగైన వసతులు కల్పించేలా ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమావేశం లో రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటె డ్ చైర్మన్ ,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి, ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు వేణు రాజ్, రత్నాకర్, అంతిరెడ్డీ రాజారెడ్డి, అవెజ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement