Sunday, June 30, 2024

TS : వెంటనే త‌డిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి… మాజీమంత్రి హ‌రీశ్‌రావు

త‌డిసిన ధాన్యాన్ని ప్ర‌భుత్వం కొనుగోలు చేయాల‌ని మాజీమంత్రి హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు. ఇవాళ జగిత్యాల జిల్లాలోని పూడూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. అనంత‌రం రైతుల‌తో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.

- Advertisement -

అనంతరం హరీష్‌ రావు మాట్లాడుతూ రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని రైతులు తెలిపారని వివరించారు. ధాన్యం తడిచి మొలకెత్తిందని వడ్లను కొనమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
పండని సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయడమే అని రైతులు అన్నారని తెలిపారు. తమ పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని తనను కోరినట్లు హరీష్‌ రావు వెల్లడించారు. అనంతరం జగిత్యాల జాయింట్ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన హరీష్ రావు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కొండగట్టు అంజన్నసేవలో…
అంతకుముందు కొండగట్టు అంజనేయ స్వామిని ఈ ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదాలతో స్వాగతం పలికారు. వేదపండితులు వేద ఆశీర్వచనలు అందజేశారు. పూజల అనంతరం స్వామవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన హరీష్​రావును స్థానిక నేతలు సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement