Saturday, June 1, 2024

TS : బీఆర్ఎస్ నేతలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి… హ‌రీశ్‌రావు

బీఆర్ఎస్ నేతలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌ రెడ్డి హ‌త్య‌కు గురికావ‌డంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ నేత శ్రీధర్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో రాష్ట్రంలో దాడులు పెరిగాయని, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు బీఆర్ఎస్ నేతలు హత్యకు గురయ్యారని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదన్న హరీశ్ రావు కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement