Thursday, May 26, 2022

సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి : దాసరి..

పెద్దపెల్లి, ప్ర‌భ‌న్యూస్ : నిరుపేదల అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ప్రజలకు వివరించాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఏర్పాటుచేసిన యువజన సదస్సులో మాట్లాడుతూ ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, తెరాస యువజన విభాగం ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. గతంలో లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారాన్నారు.

గత పాలకుల హయాంలో పెద్దపెల్లి అభివృద్ధికి నోచుకోలేదని, గత ఎనిమిదేళ్లుగా 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చుపామన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి స్రవంతి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్, పెద్ది వెంకటేష్, బిక్షపతి,సురేందర్, పైడ రవి, చంద్ర శేకర్, అశ్రఫ్, ముబిన్, శ్రీదర్, తబ్రెజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement