Monday, May 6, 2024

NZB: కార్యకర్తల సంక్షేమమే నా ధ్యేయం…ఎంపీ అరవింద్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పలు నియోజకవర్గాల్లో కార్యకర్తలు పలు కార్యక్రమాలను చేపట్టారు. బీజేపీ పార్టీ కార్యకర్తల సంక్షేమమే తమ ధ్యేయమని ఎంపీ అరవింద్ అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఏర్పడిన అరవింద్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని బస్వ గార్డెన్ లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా లబ్ధిపొందిన 82కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఏడీఎఫ్ ఫౌండేషన్ ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలతో ఎంపీ అరవింద్ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఇలాంటి నాయకుడిని చూడలేదన్నారు. పార్టీ కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారికోసం సొంత డబ్బులు వెచ్చించడం అభినందనీయమన్నారు. కార్యకర్తల కుటుంబాల్లో ఎవరైనా చనిపోయినా కానీ.. ప్రమాదవశాత్తు గాయపడినా… లేదా వారింట్లో ఏదైనా శుభకార్యం చేపట్టినా తన వంతు సహాయంగా ఎంపీ అరవింద్ డబ్బులు అందజేస్తూ వారికి అండగా ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. హలో బూత్ స్థాయి కార్యకర్తల కుటుంబాలతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపు కోవడం ఆనందంగా ఉందని ఎంపీ అరవింద్ అన్నారు.

పార్లమెంట్ పరిధిలో కొత్తగా 18మంది బూత్ స్థాయి కార్యకర్తలకు చెక్కులు అందజేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి మహిళలకు, వారి పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ… 2021 సెప్టెంబర్ లో అమిత్ షా సమక్షంలో అరవింద్ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కుటుంబాలకు చేయూతనందించామని తెలిపారు. కార్యకర్తల కుటుంబాల్లో కష్టానికి.. అయినా తమ ఫౌండేషన్ తరపు నుంచి డబ్బులు అందించి వారికి అండగా ఉన్నామని తెలిపారు. 82 మంది కుటుంబాల్లో ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి, అనారోగ్యానికి గురైన పసిపిల్లల ప్రాణాలు కాపాడడం, వారికి అండగా ఉండడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఎంపీ అరవింద్ తెలిపారు. అరవింద్ ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతుందన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలు అరవింద్ ఫౌండే షన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


ధర్మపురి యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..
ఆర్మూర్ నియోజకవర్గంలో అంకాపూర్ గ్రామంలో ఎంపీ అరవింద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ధర్మపురి యువసేన ఆధ్వర్యంలో అంకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులను ఎంపీ అరవింద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పల్లె గంగా రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్య క్షులు బసవ లక్ష్మీ నరస య్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, ఎర్రం సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతానకార్ లక్ష్మీనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు గడ్డం రాజు, పుట్టా వీరేందర్, మాస్టర్ శంకర్ పంచారెడ్డి, శ్రీధర్, ఇల్లెందుల ప్రభాకర్, గోపిడి వినోద్ రెడ్డి, గౌడపు భరత్ భూషణ్, మట్టం పవన్, హరీష్ రెడ్డి, పవన్, ముందడ గట్ల గంగాధర్, సంజయ్ పురోహిత్ , బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement