Monday, October 28, 2024

Welfare Government – లారీ యజమానుల, కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – పువ్వాడ

ఖమ్మం నగరం : ఖమ్మం పట్టణ లారీ యజమానులు సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు దొంతరబోయిన భద్రం, ప్రధాన కార్యదర్శి బోయపాటి వాసు ఇతర నూతన కార్యవర్గానికి శాలువాకప్పి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో మృతి చెందిన సంఘం సభ్యుల కుటుంబాలకు రూ.1లక్ష చెక్కులను మంత్రి పువ్వాడ చేతుల మీదుగా ఆ కుటుంబాలకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన కార్యవర్గం సంఘం అభివృద్ది, సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. పేద లారీ ఓనర్స్ , కార్మికుల కోసం ప్రభుత్వం నుండి కేటాయించిన ధాన్యం, పత్తి, మొక్క జొన్నలు ఇలా అనేక టెండర్ ల ను ఖమ్మం లారీ అసోసియేషన్ వారికే ఇచ్చామన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా వెన్నంటే ఉండి కాపాడుకున్నామన్నారు. లారీల మీద ఆధార పడి కొన్ని వందల కార్మికుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, వారి సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ నీరజ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆర్ జె సి కృష్ణ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, కార్పొరేటర్లు తోట రామారావు, శీలంశెట్టి రమా వీరభద్రం, చాంబరఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, బీఆర్ఎస్ నాయకులు, లారీ యజమానులు, కార్మికులు వారి కుటుంబాలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement