Wednesday, November 6, 2024

TG | కస్తూరిబా హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌…

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కస్తూరిబా కస్తూర్బా బాలికల వసతి గృహానికి చెందిన విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం భోజనానంతరం విద్యార్థులకు ఆహారం వికటించింది.. దీంతో తీవ్రంగా వాంతులు కావడంతో విద్యార్థినిలు అస్వస్థతకు గుర‌య్యారు. ఫుడ్ పాయిజ‌నింగ్ కార‌ణంగా 50 మంది విద్యార్థినులు ఆసుప‌త్రి పాల‌య్యారు.

సమాచారం అందుకున్న అధికారులు విద్యార్థినులను పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement