Sunday, April 14, 2024

TS | పెద్దపల్లి ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ గా ఇస్తాం : గజ్జెల కాంతం

పెద్దపల్లి ఎంపీ సీటును సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, సీఎం.రేవంత్ లకు గిఫ్ట్ ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం చెప్పారు. తెలంగాణలోని మూడు రిజర్వుడ్ పార్లమెంటు నియోజకవర్గాలలో రెండు సీట్లు మాదిగలకు ఇవ్వాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్ మున్షికి విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 68 శాతం మాదిగలు ఉన్నట్టు కాంతం వివరించారు.

దీపాదాస్ సానుకూలంగా స్పందించినట్టు గజ్జె ల కాంతం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజాసంఘాల జే ఏ సి పోషించిన పాత్ర, సకలజనులను సంఘటితం చేసి పోరాడిన తీరు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జికి కాంతం వివరించారు. తనకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సారి తనకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయిస్తే ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలుపొందగలనని గజ్జెల ధీమా వ్యక్తం చేసారు.దీపాదాస్ మున్షీకి కాంతం తన వినతి పత్రం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement