Monday, April 15, 2024

Vishwak Sen | గామి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

విశ్వక్ సేన్ మొస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘గామి’ కూడా ఒక్కటి. విద్యాధర్ డైరెక్షన్‌లో కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా రిలీజ్ డేట్‌ని రీసెంట్‌గా అనౌన్స్‌చేశారు మేకర్స్. ఆ తరువాత వెంటనే మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసి మూవీపై మరింత బజ్ క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకోగా.. తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ రేపు 11:7 గంటలకు సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నారు. హిమాలయాలు, వారణశి వంటి ప్రాంతాల్లో సినిమా షూట్ చేసినట్లు సమాచారం. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్ కాగా ఎంజి అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement