పెరుమాండ్లగూడెం రైతుల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సిఐ, ఎస్ఐ, వారికి సహకరించిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ‘చలో పంథిని’ కార్యక్రమంలో భాగంగా ధర్నాలో పాల్గొన్న బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. అనంతరం ధర్నా చేస్తున్న నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. రైతుల రాజ్యం అని చెప్పే కేసీఆర్ ఇప్పుడు ఎం మాట్లాడతారు అన్నారు. జిల్లాలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఈరోజు వరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు మెదపరు ఎందుకు?, భూములు కోల్పోయి ఆందోళనలో ఉన్నవాళ్లపై పోలీసు కేసులా ? పెడతారని ప్రశ్నించారు. వెంటనే రైతుల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సిఐ, ఎస్ఐ, వారికి సహకరించిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి. కార్యక్రమలో వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ మంత్రి డాక్టర్. విజయ్ రామరావు, మాజీ ఎమ్మెల్యేలు మర్తినేని ధర్మారావు, వన్నల శ్రీరాములు, జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement