Wednesday, May 1, 2024

పెరుగుతున్న గోదావరి ఉధృతి… నీట మునిగిన రహదారులు…

వాజేడు : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి అత్యధికంగా వరద నీరు చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుంది. కాలేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ సమ్మక్క సారలమ్మ తుపాకులగూడెం మేడిగడ్డ బ్యారేజీల గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ఉధృత పెరుగుతుంది. క్రమేపి పెరుగుతూ గోదావరి ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద మధ్యాహ్నం రెండు గంటల సమయంలో 14. 290 మీటర్లకు చేరుకుంది. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల పరిధిలోని టేకులగూడెం గ్రామం వద్ద 163 జాతీయ రహదారి నీటిమనగడంతో తెలంగాణ ఛత్తీస్గడ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయి రవాణా సౌకర్యం స్తంభించింది.

వాజేడు గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య ఉన్న కొంగాల వాగు వంతెన నీటి మునగడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా చందుపట్ల పేరూరు గ్రామాల మధ్య ఉన్న మర్రి వాగు బ్రిడ్జి నీట మునగడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించింది. వాజేడు మండలంలో రెండో ప్రమాద హెచ్చరిక కు దగ్గరలో గోదావరి నీటిమట్టం కొనసాగుతుంది. దీనితో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement