Tuesday, April 23, 2024

లారీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. రైతు కష్టం వర్షార్ప‌ణం

(ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి) : ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం అధికారులు , ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కదలకుండా వర్షానికి కల్లాల్లోనే తడిసి ముద్దయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం, మల్హర్, రేగొండ, భూపాలపల్లి,చిట్యాల తదితర మండలాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్య బాండగారం గా పేరున్న గణపురం మండల కేంద్రంలో గత పదిరోజుల క్రితం సుమారు 1000 ఎకరాల ఆయకట్టులో సాగు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుకుంది. కాగా సుమారు 40 లారిల ధాన్యం కాంటలై తరలించేందుకు లారీలు రాక కల్లాల్లోనే మగ్గుతుంది. మంగళవారం జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి కల్లాలోని ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఈ సంద‌ర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. కాంటాలు చేసి పది రోజులు గడుస్తున్న సకాలంలో కాంట్రాక్టర్ లారీలు పంపకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని, చేతికి వచ్చిన పంట వర్షార్పణం అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్లక్ష్యం వహించిన లారీ కాంట్రాక్టర్, సంబధిత అధికారుల పై చర్యలు తీసుకుని తడిసిన ధాన్యం కొనుగోలు చేసి న్యాయం చేయాలని ఆయా మండలాల రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement