Sunday, September 24, 2023

Suryapet: నర్సుల నిర్లక్ష్యానికి నవజాత శిశువు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీకి నర్సులు డెలివరీ చేశారు. దీంతో శిశువు మృతి చెందింది. ఈరోజు ఉదయం నొప్పులు రావడంతో సిబ్బంది డాక్టర్ కు సమాచారమిచ్చారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు డెలివరీ చేశారు. పసికందుకు సీరియస్ గా ఉందని నర్సులు హడావుడి చేశారు.

- Advertisement -
   

ఆస్పత్రిలో చిన్న పిల్లల వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం, ఆలస్యం కావడంతో శిశువు మృతి చెందింది. అజాగ్ర‌త్త‌తో నర్సులు వైద్యం చేయడంతోనే శిశువు మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితురాలు నడిగూడెం మండలం కరివిరాలకు చెందిన మానసగా గుర్తించారు. నర్సులు డాక్టర్ కి సమాచారం ఇచ్చినా రాలేదని బంధువుల ఆవేదన వ్యక్తవ చేశారు. న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement