Saturday, October 12, 2024

వాన కురిసింది… గూడు చెదిరింది…

వాజేడు : శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ఎడ్జర్లపల్లి గ్రామానికి చెందిన కంపెల్ల ఆదిలక్ష్మి వృద్ధురాలుకు చెందిన పెంకటిల్లు కుప్పకూలి నేలమట్టమయి గూడు చెదిరింది. దీనితో 80 ఏళ్ల వృద్ధురాలు తలదాచుకోవడానికి నిలువ నీడ లేక వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన వాజేడు మండలం శనివారం చోటుచేసుకుంది. దీంతో ఆ వృద్ధురాలు దిక్కుతోచక దీనస్థితిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అధికారులు స్పందించి నిలువ నీడ కూలిపోయిన వృద్ధురాలుకు తక్షణ సహాయం చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. మానవతావాదుల సహాయం కోసం వృద్ధురాలు ఎదురుచూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement