Friday, May 10, 2024

ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరగాలి : క‌లెక్ట‌ర్ గోపి

వరంగల్ : వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు నిమజ్జన ప్రదేశాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలో గణేష్ నిమజ్జన ప్రదేశాలైన రంగసముద్రం ఉర్సు గుట్ట కట్టమల్లన్న చెరువు, దేశాయిపేట చిన్న వడ్డే పల్లె నిమజ్జన ప్రదేశాలను జిడబ్ల్యూఎంసి కమిషనర్ ప్రావీణ్య, ఆర్డిఓ మహేందర్ జి సంబంధిత అధికారులతో కలిసి శనివారం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగసముద్రం, బేస్తం చెరువు, కట్టమల్లన్న చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువు, కోట చెరువుల దగ్గర ఎలాంటి ఆటంకాలు లేకుండా భారీ గేట్లను ఏర్పాటు చేయాలని… వచ్చిపోయే వాహనాలకు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రతి చెరువు దగ్గర భారీ క్రేన్లను పెట్టాలని అదనంగా మరో రెండు ఎమర్జెన్సీ కోసం క్రేన్లను ఉంచాలన్నారు. గజ ఈతగాళ్లను.. బోట్లను ఏర్పాటు చేయాలని, గుర్రపు డెక్క తొలగించి చెరువు అంతా శుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, గజ ఈత గాళ్ల‌ను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ నుంచి ఏ పరిమాణాలలో విగ్రహాలు వస్తాయన్న సమాచారం రెవెన్యూ అధికారుల దగ్గర ఉండాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement