Tuesday, June 18, 2024

వడదెబ్బతో మత్స్యకారుడు మృతి..

తొర్రూరు టౌన్ మే 17 (ప్రభ న్యూస్) : చేపల వేటకు వెళ్లి వడదెబ్బతో మత్స్యకారుడు మృతి చెందిన ఘటన జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుర్తూరు గ్రామంలోమంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గుర్తూరు గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తుడు పెసర రాజు(30) అనే మత్స్యకారుడు మంగళవారం గ్రామంలోని పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లిన క్రమంలో వడదెబ్బ తగలడంతో సొమ్మసిల్లి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన తొర్రూరులోని ప్రవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మరణించినట్లు తెలిపారు. మృతడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు, తల్లి యాకమ్మ ఉన్నారు. రాజు మృతితో గుర్తూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమను ప్రభుత్వ ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement