Sunday, May 29, 2022

KTPP లో కరోనా కలకలం : 50 పాజిటివ్ కేసులు న‌మోదు

భూపాలపల్లి : ప్ర‌స్తుతం ఎవ‌రి నోట విన్నా క‌రోనా మాట‌నే విన‌బ‌డుతోంది..ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడుకుంటున్నది క‌రోనా గురించే.. రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా కేసులు వేల సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. ఈ క‌రోనా కేసులు భారీగా పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే తాజాగా… జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారు కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ చెల్పూర్ (KTPP) లో కరోనా కలకలం రేపింది. ఒక్కరోజే 50.కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తోటి సహోద్యోగులు భయాందోళనలో వున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement