Sunday, February 25, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆక‌స్మిక త‌నిఖీ.. పోలీస్ కమిషనర్

ఘన్పూర్ మండల కేంద్రంలోని నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంధర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు కేంద్రానికి ధాన్యం తీసుకు వచ్చిన రైతులతో పోలీస్ కమిషనర్ ముచ్చటించారు. ధాన్యం కొనుగోలు సమయంలో తీస్తున్న తరుగు వివరాలను పోలీస్ కమిషనర్ రైతులను ఆడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రైతులతో ముచ్చటిస్తూ ప్రభుత్వ నిబంధనకు లోబడి తరుగు తరుగు తీయాల్సి ఉంటుందని అంతకంటే ఎక్కువ మొత్తంలో తరుగును తీస్తే తక్షణమే స్థానిక పోలీస్ అధికారులతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ ,టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపిలకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ రైతులకు సూచించారు. ఈ తనిఖీల్లో స్థానిక తహసిల్దార్, ఘన్పూర్ ఏసీపీ రఘుచందర్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, తిరుమల్, ఘన్పూర్ ఈ ఇన్స్ స్పెక్టర్ రాఘవేందర్ వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement