Friday, May 3, 2024

దారుణం.. వ్య‌క్తిపై హ‌త్యాయ‌త్నం

జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామానికి చెందిన గాదెపాక అనీల్ అనే వ్యక్తిపై సోమవారం రాత్రి హత్యాయత్నం జరిగినట్లు ఎస్సై బి.మాధవ్ గౌడ్ తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గాదెపాక అనీల్ ఇంటి పక్కనే ఉండే బొందుగుల రాజు అనే వ్యక్తి విచక్షణ రహితంగా కత్తితో గొంతు మీద, ఛాతి మీద, వీపు మీద పలుసార్లు పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తం మడుగులో ఉన్న అనీల్ ను తన కుటుంబ సభ్యులు 108లో ఎంజీఎం హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అనీల్ పరిస్థితి విషమంగా ఉంద‌ని, వైద్యులు చిక్సిత అందిస్తున్నారు. నిన్న రాత్రి కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement