Monday, September 30, 2024

TS :ఆత్మకూరు ఎస్​ఐ సస్పెండ్​….ఉత్తర్వులు జారీ చేసిన సిపి

వరంగల్ క్రైమ్, ఫిబ్రవరి 27 (ప్రభ న్యూస్): వరంగల్ పోలీస్ కమీషనరేట్లోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.బి ఆర్ ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేసి ఎసై దుర్గాప్రసాద్ అనుచితంగా, అమానుషంగా ప్రవర్తించారంటూ బి ఆర్ ఎస్ నేతలు కడియం శ్రీహరి, చల్లా ధర్మారెడ్డిలు సీరియస్ గా స్పందించారు.

ఎసైని సస్పెండ్ చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులు సానుకూలంగా స్పందించకపోతే ఈనెల 28న, చలో ఆత్మకూరు ఆందోళన కార్యక్రమంకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ జరిపి సదరు ఎసై పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చేసిన సిఫార్సుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సస్పెండ్ వేటు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement