Saturday, October 5, 2024

Breaking: ల్యాండ్ పూలింగ్ నిలిపివేత.. KUDA ప్రకటన

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్ ను నిలిపివేస్తున్నట్లు కూడా(KUDA) చైర్మన్ సుందర్ రాజు ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యేలను కలిసి ఈనిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత వారం రోజుల నుంచి రైతులు చేస్తున్న ధర్నాలతో ఈనిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రిండ్ రోడ్డుకు రైతులు సహకరిస్తున్న వారిని కొంతమంది తప్పుదోవ పట్టించారన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రైతులు కన్నీళ్లు పెట్టనివ్వడని చైర్మన్ సుందర్ రాజు చెప్పారు.

కాగా, గతంలో వరంగల్ జిల్లాలో అక్రమంగా తీసుకున్న ల్యాండ్ పూలింగ్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల రైతులు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సోమవారం హన్మకొండలోని వరంగల్ కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement