Sunday, May 5, 2024

RR: కారు గుర్తు కు ఓట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలి… వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, నవంబర్ 26 ( ప్రభ న్యూస్):కారుకు ఓటేద్దాం పేద కుటుంబాల మహిళలకు జీవనభృతిగా నెల నెల 3000 రూపాయలు తీసుకుందాం. అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. ఆదివారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని రెండవ వార్డ్ ధర్నారంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తు మహిళల కన్నీరు చూసి మిషన్ భగీరథ త్రాగు నీరు ఇచ్చిన కెసిఆర్ ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలిచి కారు గుర్తుకు ఓటెయ్యాలన్నారు.

ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేసుకుందామ‌ని, వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధన్నారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ లంకాపుష్పత్తి రెడ్డి, కౌన్సిలర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement