Sunday, May 19, 2024

Voice of BJP – నియంత‌లా కెసిఆర్ – ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్కేస్తున్నారంటూ కిష‌న్ రెడ్డి ఫైర్

హైద‌రాబాద్ – కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ‘ఛలో బాట సింగారం’ కార్యక్రమం తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కిషన్‌ రెడ్డి బాట సింగారం బయలుదేరడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ , ‘బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై కూర్చుని ధర్నాలు చేయొచ్చని, కేవలం చూడడానికి మాత్రమే వెళ్లాలని అనుకున్నామని, నేనొక సంఘ విద్రోహ శక్తినా, టెర్రరిస్టులను, నేరస్తున్నా.. ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వచ్చినప్పుడు పోలీసులు వెంటపడ్డారని, నన్ను అరెస్టు చేసిన తీరును తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, ఈ గృహ నిర్భంధం ఎందుకోసమని అడుగుతున్నామన్నారు. కేసీఆర్ ఇంటికి వెళుతున్నామా ఆయన ఫాంహౌస్ కి వెళ్తున్నామా.. ప్రజల బాధలు చూడటానికి వెళ్తే అరెస్టు చేస్తారా.. ఈ రోజు కల్వకుంట్ల కుటుంబం తాము నీడను తామే చూసుకొని భయపడుతున్నారు. అందుకోసమే ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల పహారా మధ్య పాలన చేస్తున్నారు. ప్రజలకు సమాధానాలు చెప్పలేనిస్థితిలో ప్రభుత్వం ఉంది. తెలంగాణ ఆడపడుచులకు అన్యాయం చేస్తున్నారు. యుద్ధం మొదలైంది.. యుద్ధానికి మేము సిద్ధమే. కల్వకుంట్ల కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీతో శాంతియుతమైన యుద్ధం చేస్తాం. పేద ప్రజల కోసం, పోడు భూముల కోసం, నిరుద్యోగ భృతి కోసం, దళిత బంధు కోసం యుద్ధం చేస్తాం. కేంద్ర మంత్రిగా ఉన్న నా పై దౌర్జన్యం చేస్తారా. పార్టీలు మారే వ్యక్తులం కాదు మేమం. బీఆర్ఎస్ పాపాలు పండాయి. ఈ రోజు పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించిన తీరును మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అరెస్టులతో భయపడను. బాధ్యతా రహితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రశ్నించే గొంతును తొక్కేస్తుంది.’ అని అన్నారు.

రాష్ట్రంలో గత తొమ్మిది ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా డబల్ బెడ్ రూమ్ కడతామని ప్రచారం చేసిందని, తొమ్మిదేళ్లు కావస్తుంది ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కూలీలు దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులు అర్హులైన ఏ ఒక్కరికి కూడా ఎవరికి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ఊరిస్తున్నారు తప్పా ఇవ్వడం లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూడటానికి వెళ్లాలని అనుకున్నామని, శాసనసభ్యులు ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి చూద్దామని అనుకున్నామని, 25వ తేదీ పోరాటానికి పిలుపునిచ్చామన్నారు. ఈరోజు కేవలం చూడడానికి వెళ్దామని అనుకున్నామని, ఆకారణంగా కార్యకర్తలను పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న వారిని అరెస్టు చేశారని, ఆదిలాబాద్, బోధనలో ఉన్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేశారని ఆయన ధ్వజమెత్తారు.

ఈటల రాజేందర్, డీకే అరుణ అరెస్టు చేశారని, మోహన్ రావు, జితేందర్ ఇలా ప్రతి ఒక్క నాయకున్ని అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటు పోతుందో తెలంగాణ అర్థం కావడం లేదన్న కిషన్‌ రెడ్డి నియంతృత్వ ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement