Monday, April 29, 2024

Hyderabad – శిలా ఫ‌లకాలు ధ్వంసం ….కాంగ్రెస్ పై వినోద్ కుమార్ ఆగ్ర‌హం..

హైద‌రాబాద్ – వ‌రంగ‌ల్, అచ్చంపేట‌ల‌లో ప్రారంభోత్స‌వ‌. శంకుస్థాపన ల శిలా ప‌ల‌కాల‌ను ధ్వంసం చేయ‌డం ప‌ట్ల మాజీ ఎంపి వినోద్ కుమార్ కాంగ్రెస్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదని వ్యాఖ్యానించారు. అధికార పక్షం మారినంత మాత్రాన శిలాఫలకాలు తొలగించడం సబబు కాదన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యాలోని శిలాఫలకాలను ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలనే సీఎం క్యాంప్ ఆఫీసులను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది అని, ఆది ప్రజల ఆస్తి అన్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేసి, వాటి స్థానంలో వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు..

బీఆర్ఎస్ ఏర్పడింది తెలంగాణ కోసమని.. ప్రజల పక్షాన నిలబడతామన్నారు. గతంలో కాంగ్రెస్ చరిత్రను మర్చిపోవద్దని హితవుపలికారు. ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీలో కాంగ్రెసుకు ప్రజలు ఇచ్చిన తీర్పును మర్చిపోవద్దన్నారు. ప్రజల తీర్పుతోనే తాము సైతం ప్రతిపక్షంలో ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement