Wednesday, May 1, 2024

Vikarabad – బిజెపి అభ్యర్థి నవీన్ కుమార్ కు బురాన్ పల్లి తండా గ్రామస్తులు స‌త్కారం

వికారాబాద్ నవంబర్ 12 ( ప్రభ న్యూస్): భారతీయ జనతా పార్టీ వికారాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దింటి నవీన్ కుమార్ ను ఆదివార నాడు బురాన్ పల్లి తండా గ్రామస్తులు పూలమాల శాలువాతో సన్మానించారు. బురన్ పల్లి తండా సమీపంలోని దేవాలయం వద్ద గ్రామస్తులు నవీన్ కుమార్ కు మంగళహారతి తో స్వాగతం పలికి శాలువా సన్మానం చేశారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు సదానంద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్ సీనియర్ నాయకులు ప్యాట శంకర్ యాదగిరి బసవలింగం అమరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement