Sunday, May 5, 2024

Vikaraabad – చెరువులోకి దూసుకెళ్లిన కారు…అందులో నలుగురు…

వికారాబాద్ డిసెంబర్ 25 ( ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో గల శివారెడ్డిపేట చెరువులోకి ఓ కారు దూసుకెళ్లిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది ఆదివారం నాడు హైదరాబాద్ నుండి అనంతగిరి కి వచ్చే పర్యాటకులు ఇక్కడ బస్ చేసి సోమవారం ఉదయం బయలుదేరి వెళ్తారు సోమవారం ఉదయం ఏడు గంటలకు కురుస్తున్న కారణంగా ముందు ఉన్న రోడ్డు సరిగా కనిపించక సమయుత కారు శివరెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లినట్టు సమాచారం.

ఆ కార్లో డ్రైవర్తోపాటు మరో నలుగురు ఉండగా నలుగురు బయటకు వచ్చారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇతర వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement