Friday, May 3, 2024

Vemulawada – తుల ఉమ‌కు బిజెపి షాక్… విద్యాసాగ‌ర్ కుమారుడికి సీటు..

వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం బి జె పి టికెట్ విషయంలో మొదటి నుండీ ఆసక్తి నెలకొంది. ఇక్కడ టికెట్ మాజీ కేంద్రమంత్రి విద్యాసాగర్ రావు కు ప్రిస్టేజి గా మారడం, తుల ఉమ కోసం ఈటల రాజేందర్ పట్టుపట్టడంతో అందరి కళ్ళు ఈ నియోజకవర్గం పై పడ్డాయి. సంగ్ పరివార్ కు కొత్తగా పార్టీ లో చేరి పట్టు సంపాదించుకున్న వారికి మధ్య పోటీగా మారింది. ప్రధాని మోడీ సూర్యాపేట పర్యటన రోజు పార్టీ తుల ఉమ పేరును అభ్యర్థిగా ప్రకటించింది. అయితే విద్యాసాగర్ రావు వర్గీయులు జీర్ణించుకోలేక నాంపల్లి లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద జాగరణ చేశారు. సంగ్ పరివార్ కూడా వికాస్ వైపు మొగ్గు చూపడంతో చివరి క్షణంలో బి ఫాన్ వికాస్ కు అందించారు. అయితే ఇదే రోజు నామినేషన్ వేసినందుకు ప్రదర్శనతో వచ్చిన తుల ఉమ అధిష్టానం నిర్ణయంతో షాక్ కు గుర‌య్యారు.. ఆక‌స్మికంగా త‌న‌కు ఇచ్చిన టికెట్ వికాస్ కు ఇవ్వ‌డంతో ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement