Tuesday, May 14, 2024

కులవృత్తులను ఆదరిస్తాం – మంత్రి ప్రశాంత్ రెడ్డి

నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. కుల వృత్తుల వారిని ఆదరిస్తామని కులవృత్తుల వారికి మరింత సహకారం అందించేందుకు రుణములేని లక్ష రూపాయలను అందజేస్తున్నామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కుల మతాల కతీతంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల ముందు ఎంతోమంది ఎన్నో ఏజెండాల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వారి మోసాలకు ప్రజలు గురి కావద్దని మంత్రి ప్రజలకు అవగాహన కల్పించారు. మా అభ్యర్థిని బలపరిచి ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వమే ఏర్పాటు కాబోతుందని జోస్యం చెప్పారు. బాల్కొండ ప్రాంతాన్ని ఇప్పటికే అభివృద్ధిలో సంక్షేమాలు ఎంత ముందుకు తీసుకువెళ్లామని రాబోయే రోజుల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు భరోసా ఇచ్చారు. నాలుగేళ్ల పాటు కనపడని పార్టీలు నాయకులు జోరుగా ప్రచారాలు చేపడుతున్నారని తాము గెలుపొందిన నాటి నుండి నేటి వరకు శ్రమిస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నామని ప్రజలు కూడా ఎన్నికల దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు.

గతంలో రాష్ట్ర రైతాంగం ఎన్నో కష్టాలను చూశారని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతని రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా విద్యుత్ సరఫరా విషయంలో 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు మెరుగైన నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని, రైతులకు రుణమాఫీ రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ఎన్నో అమలు చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. ఈరోజు ప్రగల్ బాలు పలుకుతున్న కాంగ్రెస్ బిజెపి నాయకులు వారి పాలనలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి సూటిగా వారిని ప్రశ్నించారు. అక్కడ అమలు చేయలేని దద్దమ్మలు ఇక్కడ మాత్రం 5000 పెన్షన్ ఇస్తాం రైతులకు ఏదో చేసేస్తామని మోసం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారని రైతులు పేద ప్రజలు వారి మోసాలకు గురైతే నష్టాలకు గురికావాల్సి వస్తుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement