Sunday, May 5, 2024

వీణ‌-వాణిల‌ను క‌లిసి – శుభాకాంక్ష‌లు తెలిసిన మంత్రులు

హైదరాబాద్,యూసఫ్ గుడ, బాలసధన్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాసైన అవిభక్త కవలలు వీణ – వాణిలను తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ , విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిసి అభినందించి,స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు..మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..ఇంటర్ ఫలితాల్లో వీణ-వాణి లకు మంచి మార్కులు వచ్చాయి.వీణాకు 712, వాణికి 707 మార్కులు వచ్చాయి.ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన వీణా వాణిలకు అభినందనలు.కోవిడ్ సమయంలో కూడా ఆన్ లైన్ క్లాస్ లు అటెండ్ అయ్యారు.వీణావాణీలకు ఈ సమయంలో తల్లి అవసరం ఉంటుంది… అందుకని తల్లికి కూడా ఉద్యోగం ఇక్కడే ఇచ్చాం.బాల సదనములో అనాధ పిల్లలు కూడా వున్నారు.
వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.. వీణావాణీలు సీఏ కోర్సు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. శ్రీ మేధ లో వారికి అడ్మిషన్ తీసుకున్నాం,వారికి ఫ్రీ కొంచింగ్ అందిస్తారు.

గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.వీణ-వాణిలకు దేవుడు అన్యాయం చేసినా.. గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ , ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకొని చదివిస్తోంది.ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని విద్యార్థులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని.. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఎడాది నష్ట పోకుండా ఉండేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ ఉంటుంది.ఈ సమయంలో విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని వారి తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులతోపాటు మహాబూబాబాద్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్స్ KRS లక్ష్మిదేవి, సునంద, అసిస్టెంట్ డైరెక్టర్ పద్మజ, రీజినల్ జాయింట్ డైరెక్టర్ శారద .. ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement