Thursday, June 13, 2024

TS: ఏసీబీ వలలో ఏవో వంశీకృష్ణ..

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్): ఫర్టిలైజర్ షాపు రెన్యువల్ లైసెన్స్ కోసం రూ.38 వేలు లంచం తీసుకుంటూ దహేగాం మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కాగజ్ న‌గర్ డివిజన్ దహేగాం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న వంశీకృష్ణ ఫర్టిలైజర్ షాప్ యజమాని శ్యామ్ రావు నుండి రెన్యువల్ లైసెన్స్ కోసం రూ.50 వేలు డిమాండ్ చేశారు.

సోమవారం మధ్యాహ్నం శ్యామ్ రావు రూ.38 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అవినీతి నిరోధ‌క‌ శాఖ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో చెన్నూర్ ఏరియాలో పనిచేసిన వంశీకృష్ణ అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ అయి కొన్నాళ్లకు విధుల్లో చేరారు. నిందితునిపై కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టుకు పంపుతున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement