Wednesday, May 1, 2024

వడ్డెర ఆత్మగౌరవ భవన నిర్మాణ ప్రొసీడింగ్స్ అందజేసిన మంత్రి గంగుల

కరీంనగర్ – తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో బీసీ కులాల ఆత్మగౌరవం కోసం వేల కోట్ల విలువైన స్థలాన్ని హైదరాబాద్ నడిబొడ్డున కేటాయించింది, కోకాపేట్ ఉప్పల్ బాగా ఎత్తులోని 87.3 ఎకరాల్లో 41 వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించబోతుంది, ఇందులో భాగంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు కరీంనగర్ లోని తన నివాసంలో వడ్డెర కుల సంఘ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రొసీడింగ్సుని ఏక కుల సంఘ నాయకులకు అందజేశారు.

ఉప్పల్ బగాయత్ లో ఎకరా స్థలం కోటి రూపాయలతో నిర్మించబోయే వడ్డెర కుల సంఘ భవనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అందుకున్న కుల సంఘ నాయకులు అతి త్వరలో ఆత్మగౌరభవన నిర్మాణం ప్రారంభించుకుంటామని తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ కేవలం సీఎం కేసీఆర్ కృషితోనే వెనుకబడిన వర్గాల్లో ఆత్మగౌరవం వెల్లివిరిస్తుందన్నారు. 19 బీసీ గురుకులాలను 310కి పెంచడమే కాకుండా ఒకే సంవత్సరంలో 112 గురుకులాలను జూనియర్ కాలేజీ లగా అప్గ్రేడ్ చేస్తూ నూతనంగా 33 గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేసి బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి చూపిస్తున్నారన్నారు. ఆత్మగౌరవ భవనాల కోసం సైతం వేల కోట్ల విలువైన స్థలాల్ని కేటాయించిన ముఖ్యమంత్రి కి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జంపేటి సత్యనారాయణ రాజు, ఎత్తరి అంతయ్య ఒరుసు కృష్ణయ్య , అనంతరావు , మక్కల పెంటేష్ , వల్లెపు వెంకట్ వడ్డెర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement